ఈ పూలను ఇలా వాడితే... నల్లని, నిగనిగలాడే కురులు మీ సొంతం!

21-12-2024 Sat 15:36 | Health
Advertisement
  • మన చుట్టూ ఉండే కొన్ని రకాల పూలలో ఎన్నో ఔషధ గుణాలు
  • వాటిని తగిన తీరులో వాడితే కేశాలకు ఆరోగ్యం
  • నల్లటి, నిగనిగలాగే జుత్తు సొంతం అవుతుందని చెబుతున్న ఆయుర్వేద నిపుణులు
Advertisement
తీవ్ర ఒత్తిళ్లు, కాలుష్యం, సరైన పోషకాహారం లేకపోవడం వంటి కారణాలతో ఇటీవల చాలా మంది జుత్తు రాలిపోయే సమస్య ఎదుర్కొంటున్నారు. అంతేకాదు వెంట్రుకలు తెల్లబడటం, గరుకుగా మరి మధ్యలోకి తెగిపోవడం వంటి సమస్యలు మరెన్నో. అయితే కొన్ని రకాల పూలు ఈ సమస్యలను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయని... పైగా వెంట్రుకలు నల్లగా, నిగనిగలాడేలా చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎలా వాడితే ప్రయోజనం ఉంటుందో వివరిస్తున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం...

మందార పూలు
మందార పూలలో కొన్ని రకాల అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అవి వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని మందార పూల రేకులు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని... వాటిని బాగా కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలని సూచిస్తున్నారు. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలని... ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు నల్లగా, నిగనిగలాడుతూ పెరుగుతాయని చెబుతున్నారు.
తామర పుష్పాలు
పొడిబారిపోయి, దెబ్బతిన్న వెంట్రుకలు తిరిగి నిగనిగలాడేలా చేసే సామర్థ్యం తామర పుష్పాల సొంతం. తామర పూల రేకుల నుంచి ఆయిల్ ను తీసి, లేదా రసం తీసి... కొంచెం కొబ్బరి నూనెలో కలిపి వెంట్రుకలు, కుదుళ్లకు మర్దన చేయాలి. అరగంట తర్వాత కడిగేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

గులాబీ పూలు
ఈ పూలలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి దెబ్బతిన్న వెంట్రుకల కుదుళ్లను పునరుద్ధరించడానికి తోడ్పడతాయి. గులాబీ రేకులను నీటిలో వేసి మరిగించి... ఆ నీటిని నిల్వ చేసుకోవాలి. తల స్నానం చేసిన తర్వాత వెంట్రుకలు, కుదుళ్లకు ఆ నీటిని పట్టిస్తే వెంట్రుకలు నిగనిగలాడతాయని నిపుణులు చెబుతున్నారు.

బంతి పూలు
బంతి పూలలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయని, అవి వెంట్రుకల కుదుళ్లలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించి పునరుద్ధరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినూనెలో కొన్ని బంతిపూల రేకులను వేసి నానబెట్టుకోవాలని... వెంట్రుకలు, కుదుళ్లకు ఈ నూనెతో మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.

మల్లె పూలు
వెంట్రుకలు పొడిబారి, తెగిపోకుండా మల్లె పూలు రక్షిస్తాయని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. ఇవి వెంట్రుకల కుదుళ్లకు పోషణను ఇచ్చి, బలోపేతం చేస్తాయని చెబుతున్నారు. జాస్మిన్ ఆయిల్ ను, కొంత 
విటమిన్-ఈ ఆయిల్ తో కలిపి వెంట్రుకలు, కుదుళ్లకు పట్టేలా మర్దన చేయాలని సూచిస్తున్నారు. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలని వివరిస్తున్నారు.

ఇవి గుర్తుంచుకోండి...
ఈ పూల వినియోగం, తీరు ఆయుర్వేద నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం పేర్కొన్నవే. వ్యక్తులను బట్టి, వినియోగం తీరును బట్టి ఫలితాలు వేర్వేరుగా ఉండవచ్చు. అందువల్ల దగ్గరిలోని ఆయుర్వేద నిపుణులను సంప్రదించి వినియోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
Healthoffbeathair growthHairFlowerslotusViral News

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more